పరకాల నియోజకవర్గ పరిధిలోని సంగెం మండలం, పరకాల పట్టణం నుండి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీకి బిగ్ షాకిచ్చారు. హనుమకొండ భవాని నగర్ లోని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నివాసంలో సంగెం మండలం, పరకాల పట్టణ పరిధిలోని బీ ఆర్ ఎస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
బీ ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో సంగెం మండలం నుండి ఎంపీపీ కందగట్ల కళావతి రైతు బంధు మండల అధ్యక్షులు కందగట్ల నరహరి, సంగెం ఎంపీటీసీలు మెట్టుపళ్లి మల్లయ్య, నల్లబెల్లి ఎంపిటిసి కట్ల సుమలత, కుంటపల్లి మాజీ సర్పంచ్ కావటి వెంకటయ్య, తిమ్మాపురం మాజీ సర్పంచ్ మాధినేని రాంరెడ్డి, గవిచర్ల మాజీ సర్పంచ్ పతిపాక రమేశ్, మాజీ వైస్ ఎంపీపీ కాగితాల జయలక్ష్మి జగన్నాథ చారి, సంగెం మాజీ సర్పంచ్ రాయపురం మల్లికాంబ ఎల్లయ్య, కుంటపల్లి మాజీ సర్పంచ్ రౌతు నాగయ్య, సంగెం పిఎసిఎస్ డైరెక్టర్ గోపతిరాజు, గొల్లపల్లి గ్రామ సీనియర్ నాయకులు కన్నెబోయిన రాజు యాదవ్, మోండ్రాయి గ్రామ సీనియర్ నాయకులు గుర్రం సాంబయ్య, కాపుల కనపర్తి గ్రామ సీనియర్ నాయకులు ఆరూరి రమేశ్ తోపాటు, ఉప సర్పంచులు వార్డు మెంబర్లు ఆ పార్టీ నేతలు సుమారు 500 మంది బీ ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే పరకాల పట్టణం నుండి మాజీ పిఎసిఎస్ బండి శ్రీధర్, మాజీ కౌన్సిలర్ బండారి కృష్ణతో పాటు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ములుగురి బిక్షపతితో పాటు ఆయా మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Warangal: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్
కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు