Friday, November 22, 2024
HomeతెలంగాణWarangal: కాజీపేటను మరింత అభివృద్ధి చేస్తా

Warangal: కాజీపేటను మరింత అభివృద్ధి చేస్తా

జీరో బిల్స్ అందజేత

కాజీపేట చౌరస్తాలో 62వ, 63వ డివిజన్లో సంయుక్త కాజీపేట పోలీస్ స్టేషన్ నుండి సోమిడీ బొడ్రాయి వరకు 60ఫీట్ల రోడ్డులు, డివైడర్ ద్వారా ఇరువైపులా లైటింగ్స్ తో, కాజీపేట నుండి సోమిడీ వరకు నూతనంగా వాటర్ పైప్లైన్ లకు, అభివృద్ధి కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జక్కుల రమరవీందర్ యాదవ్, 62వ డివిజన్ కార్పొరేటర్, 63వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి శంకుస్థాపన చేసారు.
కాజీపేట అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతవరకు కాజీపేట అభివృద్ధికి నోచుకోలేదంటూ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక రంగాల్లో హనుమకొండ జిల్లా, కాజీపేట పట్టణం అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అని, కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని, వీలైనంత త్వరలో అనేక రంగాల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. కాజీపేట పట్టణాన్ని వీలైనంత త్వరలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, రావుల సదానందం, రమణారెడ్డి, సుంచు అశోక్, గుంటి కుమార్, పిఎసిఎస్ డైరెక్టర్ మెరుగు రాజయ్యయాదవ్, బంక సంపత్, డాక్టర్ శ్రావణకుమార్ , అంకుష్, జయకర్, వీరస్వామి, ఇన్నారెడ్డి, ఎన్.వి రాజు, మేకల ఉపేందర్, ఆరూరి సాంబయ్య, సిరిల్ లారెన్స్, సుధాకర్, నీలక్క, రవికిరణ్, బైరబోయిన రమేష్, దొంగల కుమార్, బర్ల రాజ్కుమార్, గుర్రం అమర్నాథ్, బుర్ర బాబు, ఆంజనేయులు, అశోక్, పాక భాస్కర్, శివరాం, 62వ 63వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

దీన దయాల్ నగర్ ను సందర్శించిన ఎమ్మెల్యే..

హన్మకొండ 31 వ డివిజన్ దీన్ దయాళ్ నగర్ లో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సంధర్భంగా కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను, ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలనీ ఆదేశించారు. డివిజన్ లో ఏ సమస్య ఉన్న తమ దృస్టికి తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిస్తాత్మకంగా తీసుకున ఆరు గ్యారంటీల స్కీంలో భాగంగా జీరో బిల్ కరంట్ బిల్ ను నాయిని రాజేందర్ రెడ్డి అందించారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు నెక్కొండ కల్పనా కిషన్ కుమార్, మానస రాంప్రసాద్, చీకటి శారద ఆనంద్, మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విధ్యాసాగర్, రవి నాయక్, కార్పొరేటర్ గా పోటీచేసిన నాయిని లక్ష్మా రెడ్డి, అభ్యర్థి నలుబొల సతీశ్, తోట పవన్, డాక్టర్ శ్రవణ్ సయ్యద్ అఫ్సర్, వల్లపు ఐలయ్య, బొంత వెంకన్న, ఆలాకుంట శ్రీనివాస్, వల్లపు సాయిలు, వల్లపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News