Saturday, November 23, 2024
HomeతెలంగాణWarangal: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భేటీ

Warangal: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భేటీ

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ-వరంగల్ జిల్లా శాఖల ఉమ్మడి సర్వసభ్య సమావేశం హనుమకొండలోని హరిత కాకతీయ లో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి TGOs వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథులుగా, రాష్ట్ర నాయకులు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.

- Advertisement -

ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, అధికారుల పాత్ర, గెజిటెడ్ అధికారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ,
 తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 2008 లో ఏర్పడినది.
 ఈ సంఘాన్ని స్థాపించి, అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్ గారు ఎనలేని సేవలు అందించారు.
 మలి విడత తెలంగాణ ఉద్యమంలో టి.జి.ఓ సంఘం కీలక పాత్ర పోషించి, ఎంతోమంది అధికారులు ఉద్యోగాలకు ఇబ్బందులు ఎదురైనా అప్పటి సమైక్య ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు.
 మన ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు ఉద్యోగుల పక్షపాతి.
 తెలంగాణ వచ్చిన తరువాత 2015 లో దేశంలో ఎక్కడలేని విధంగా పి.ఆర్.సి లో 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినారు.
 2017 పి.ఆర్.సి లో కమిటీ 7.5 శాతం సూచిస్తే, మన ముఖ్యమంత్రి గారు ఏకంగా పి.ఆర్.సి లో 30 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినారు.
 పదవీ విరమణ వయస్సును 58 నుండి 61 సంవత్సరాలకు పెంచినారు.
 ప్రమోషన్ లు పొందుటకు నిర్దేశించిన మూడేళ్ళ కాలాన్ని రెండు సంవత్సరాలకు తగ్గించినారు.
 రిటైర్డ్ ఉద్యోగులకు క్వాంటమ్ అఫ్ పెన్షన్ ను 75 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలకు తగ్గించినారు.
 కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, హోమ్ గార్డులు, ఆశ వర్కర్లు, గ్రామ సేవకులకు అందరికి 30 శాతం ఫిట్ మెంట్ అందించినారు.
 అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించినారు, దానికీ ఉదాహరణ మా పంచాయతీరాజ్ శాఖ.
 ఐ.కే.పి (సెర్ప్) ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ ఇచ్చినారు.
 ఇది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం, ఇంకా ఏమైనా మిగిలిపోయిన సమస్యలు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారు.

ఈ సర్వసభ్య సమావేశానికి హన్మకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన అన్ని శాఖల గెజిటెడ్ అధికారులు, ఎన్నమనేని జగన్ మోహన్ రావు తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News