తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం (Water Dispute) నెలకొంది. శనివారం ఉదయం తెలంగాణ సిబ్బంది నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ కోసం డ్యామ్ వద్దకు వెళ్లారు. రీడింగ్ తీసుకోనివ్వకుండా ఏపీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. తెలంగాణ వారికి ఇక్కడేం పని అంటూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో మరోసారి ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యకు ఆజ్యం పోసినట్లయింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read : బోరుగడ్డకు పోలీస్ స్టేషన్‌లోనే రాచమర్యాదలు.. కొత్త వీడియో లీక్
అయితే, రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం (Water Dispute) కొత్తేమి కాదు. సరిగ్గా గతేడాది నవంబర్ నెలలోనూ సాగర్ డ్యామ్ పై ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఎగువ రాష్ట్రాలకు చెందిన పోలీస్ బలగాలు సాగర్ డ్యామ్ పై భారీగా మోహరించడంతో వివాదం చెలరేగింది. దీంతో కేంద్ర జల సంఘం శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల వద్ద భారీగా బలగాలను దింపింది. అనంతరం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు తెలంగాణ రాష్ట్రానికి అప్పజెప్పింది. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చింది.