Today Rain in tg: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. నేటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముందుగా చెప్పినట్టుగానే నిన్న సాయంకాలం నుండే రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు ప్రారంభం అయ్యాయని చెప్పుకొచ్చారు. నేడు మొత్తం రెండు రౌండ్ల భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.
రౌండ్ 1: మధ్యాహ్నం నుండి సాయంత్రం మధ్యలో:
ఇవి మధ్య, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చెల్లాచెదురుగా కానీ చాలా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో కూడా చెల్లాచెదురుగా తీవ్రమైన తుఫానులు వస్తాయన్నారు.
రౌండ్ 2: రాత్రి నుంచి రేపు ఉదయం వరకు:
ఇవి దక్షిణ, తూర్పు, మధ్య, ఉత్తర తెలంగాణలో విస్తృతంగా భారీ వర్షాలు కురుస్తాయన్నారు హైదరబాద్ వాతావరణ శాఖ అధికారులు. రాత్రిపూట ప్రధానంగా హైదరాబాద్‌లో విస్తృతంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు.
గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు లేవన్న విషయం మీకు తెలిసిందే. వర్షాలు పడాల్సిన సమయంలో మాన్ సూన్ కు బ్రేక్ పడటం కాస్త నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. అయితే వాతావరణ శాఖ అధికారులు సూచించినట్లే నేటి మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసి చెప్పవచ్చు.
గడిచిన 24 గంటల్లో:
సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాలలో తదుపరి 2 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముందుగా ఊహించినట్లుగానే, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. సూర్యాపేటలోని నాగారంలో అత్యధికంగా 70 మి.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల్లో మాత్రమే చెదురుమదురు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు మంచి వానలు పడతాయన్నారు. ప్రస్తుతం యాదాద్రి, జనగాం, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, సూర్యాపేట వంటి తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలో బలమైన వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సూర్యాపేటలోని నాగారం 70మి.మీ, యాదాద్రిలోని రామన్న పేట లో 51మి.మీ వర్షపాతం నమోదైంది. వీటితో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా రాత్రి సమయంలో భారీ వర్షాలు కురిసాయి.
ముందే చెప్పినట్లుగా:
తెలంగాణలో మళ్ళీ నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మొదలవుతాయని వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గతంలోనే తెలిపింది. గత వారమంతా ఉన్న ఈదర గాలులు నేటి నుంచి తగ్గుముఖం పట్టనున్నట్లు తెలిపారు.


