Today Rain in tg: తెలంగాణలో నేడు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే అవి అంత తీవ్రంగా ఉండవని తెలిపింది. రోజంతా వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. అయితే రేపటి నుండి క్రమంగా తుఫాను వాతావరణం మొదలవుతూ వెళ్ళే అవకాశం ఉందని ప్రకటించింది. జూలై 17 నుండి జూలై 28 చివరి వరకు మంచి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేసింది. అయితే ఈ రాబోయే వర్షాలు ఎంత వరకు లోటును భర్తీ చేస్తాయనేది ఇప్పుడే చెప్పలేం అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భారీ వర్షపాతానికి సిద్ధంగా ఉండండి:
జూలై 14-16: బలహీనమైన రుతుపవనాల కారణంగా వాతావరణమంతా అధిక వేడితో తక్కువ వర్షాలు కురిసే అవకాశాలు మాత్రమే ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
జూలై 17-22: హైదరాబాద్ నగరంతో సహా దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రాంతాలలో తీవ్రమైన ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొన్నారు.
జూలై 23-28: వరుసగా అల్పపీడనాలు కారణంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో ముసురుతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రుతుపవనాల విచ్ఛిన్నం కారణంగా తెలంగాణలో నేడు కూడా వర్షాలు ఉండవని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు నిన్ననే తెలిపారు. అనేక ప్రాంతాల్లో వాతావరణమంతా వేడి, తేమతో కూడి ఉంటుందని పేర్కొన్నారు. అయితే జూలై 16 తర్వాత వచ్చే భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలని మంచి కబురు చెప్పినప్పటికీ.. ప్రస్తుతం ఎల్లుండి నుంచి హైదరాబాద్ నగరంతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా కురవనున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో మాన్ సూన్ వర్షాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో జూలైలో సాధారణ ఎండలకు మించిన ఎండలు కొట్టాయి. జూలై 17 తర్వాత తెలంగాణలో వర్షాలు పుంజుకుంటాయి అని చెబుతున్నా.. నేడు రేపు మాత్రం ఎండలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంది. అయినప్పటికీ, ఈ రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణ స్థాయి కంటే స్వల్పంగా తక్కువగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, రాబోయే 3-4 రోజుల్లో తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.


