జూన్ 5వ తేదీ నుండి రెండో విడత గొర్రెల యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. రామన్నపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడిన ఆయన, దేశంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ఘనత కేవలం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అన్ని కులాలకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కుల వృత్తులను ప్రోత్సహించాలని గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలు కేవలం కేసీఅర్ తోనే సాధ్యమైందని ఆయన అన్నారు, దేశంలోనే అత్యధిక గొర్రెలు గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన తెలిపారు, దీని ద్వారానే రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి భారీగా పెరిగింది, మాంసం ఉత్పత్తిలో దేశంలో ఐదో స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పున్న లక్ష్మి జగన్ మోహన్ సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి మండల అధ్యక్షుడు మందడి ఉదయ్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభం పాటి శ్రీనివాస్ గౌడ్ కార్యదర్శి పోష బోయిన మల్లేష్ సర్పంచ్లు గుత్తా నర్సింహ రెడ్డి మెట్టు మహేందర్ రెడ్డి కన్నెబోయిన బలరాం మాజీ ఎంపీటీసీ రాం శివ కుమార్ ఆవుల శ్రీదర్ తదితులున్నారు.