రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు రెడ్లు ఐక్యమత్యంగా పోరాటం సాగించాలని రెడ్డి కార్పొరేషన్ సంఘం మండల అధ్యక్షుడు గూడూరు జంగారెడ్డి అన్నారు. యాదాద్రి మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో రెడ్డి సంక్షేమ సంఘం గ్రామ కమిటీల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగారెడ్డి మాట్లాడుతూ ఈనెల 22న భువనగిరిలో నిర్వహించే సభలో రెడ్డి సంక్షేమ సంఘం గ్రామ కమిటీల బలోపేతం, రెడ్డి కార్పొరేషన్ సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం, రైతు సమస్యలపై, ప్రభుత్వ సబ్సిడీలు పేద విద్యార్థుల విదేశీ చదువుల స్కాలర్ షిప్ లు మంజూరు కోసం సంఘం అభివృద్ధి కోసం, ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలు కోసం ఇతర విషయాలపై ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో మండల కోశాధికారి జక్క సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్క పద్మా రెడ్డి, మెట్టు కొండల్ రెడ్డి, జక్క జంగారెడ్డి, పాశం సత్తిరెడ్డి, మామిడి సత్తిరెడ్డి, వరకాంతం రాజేందర్ రెడ్డి, ఫక్కీర్ మోహన్ రెడ్డి, సోలిపురం సంజీవరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.