తెలంగాణ ఉద్యమం సమయంలో 15 ఏళ్ల కిందట తనకు వరంగల్ జిల్లాలో కేటాయించిన జైలు బ్యాడ్జీ తనకు ఆరాధనీయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసటింది
‘15 ఏళ్ళ కిందట అరెస్ట్ చేసి నిన్ను వరంగల్ సెంట్రల్ జైలులో పెట్టారని 100 ఏళ్ళ చరిత్ర కలిగిన జైలును కూలగొట్టించావు. ఆ పాపం ఊరికే పోదని, అధికారంలో ఉండగా మదంతో కళ్ళు నెత్తి కెక్కిన నీకు..ఉద్యమకారులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎవరు కనపడలేదని.. అధికారం పోగానే అందరి మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న నీ తీరు యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. అని మండిపడింది.
“నువ్వు నీ కుటుంబం చేసిన పాపాలకు శిక్ష పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, మళ్ళీ నువ్వు జైలుకు పోవడం ఖాయం. నువ్వు చేసిన పాపాలకు తెలంగాణలో ఏ జైలు సరిపోదు..నీకు అండమాన్ జైలే సరైంది” అంటూ పేర్కొంది.
కాగా నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 15 ఏళ్ల కిందట అరెస్ట్ అయి వరంగల్ జైలుకు వెళ్లిన నాటి సంగతిని కేటీఆర్ గుర్తు చేసుకున్న విషయం విధితమే.