Youngster Died With Heart Attack: హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. షటిల్ ఆడుతూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని స్థానిక నాగోల్ స్టేడియంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. నాగోల్‌లో షటిల్ ఆడుతుండగా గుండ్ల రాకేశ్(25) ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు.
- Advertisement -
సహచరులు రాకేశ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే రాకేశ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ వాసిగా గుర్తించారు. తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడిగా గుర్తించారు. రాకేశ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.


