జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ పేరును పార్టీ ప్రకటించిన నేపథ్యంలో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో సురేష్ షెట్కార్ పేరును ప్రకటించిన ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నారు. జహీరాబాద్ పార్లమెంటుకు పేరు ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా జహీరాబాద్ పట్టణంలో మైనార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. సురేష్ షెట్కార్ లోకల్ మనిషి మన ప్రాంతానికి చెందిన వాడని శాసనసభ అభ్యర్థిత్వాన్ని త్యాగం చేసిన వ్యక్తి అని, అతని భారీ మెజార్టీతో గెలిపించాలని మైనార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.