జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి గ్రామంలో నిర్వహించిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతరలో ఆదివారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ లు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
- Advertisement -
ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే, డీసీఎంఎస్ చైర్మన్ తదితరులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. జహీరాబాద్, ఝరాసంగం, మొగుడంపల్లి మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, సంజీవ్ రెడ్డి పాక్స్ చైర్మన్ మచ్చెందర్, మాజీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్, యువ నాయకులు చిన్నారెడ్డి, ప్రవీణ్ పాటిల్, రాథోడ్ భీమ్ రావు నాయక్, విజయ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.