Friday, October 18, 2024
HomeతెలంగాణErrabelli: రాష్ట్ర స్థాయి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అవార్డులు -2023

Errabelli: రాష్ట్ర స్థాయి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అవార్డులు -2023

రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకున్న ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు

రాష్ట్ర స్థాయి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అవార్డులు -2023 ను ఆయా విజేతలకు అందచేశారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అవార్డు వచ్చిన గ్రామాలకు 10 లక్షల రూపాయలను ప్రైజ్ మనీగా తక్షణం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు వేగం చేసింది.

- Advertisement -

స్వచ్ఛ సర్వేక్ష‌ణలో దేశంలో మ‌న‌మే నెంబ‌ర్ వ‌న్ గా ఉన్నామని మంత్రి ఎర్రబెల్లి ఈసందర్భంగా వెల్లడించారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా గ‌తంలో స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ గ్రామీణ్ అవార్డుల‌నేకం మ‌నం పొందామని ఎర్రబెల్లి గుర్తుచేశారు. ఒక్క ఏడాదిలోనే 20 అవార్డుల ప్ర‌క‌టిస్తే 19 అవార్డులు సాధించాం అనేక అంశాల్లో ఆన్ లైన్ లో వేసే మార్కుల్లోనూ మ‌న ప‌ల్లెలు మొద‌టి స్థానంలో నిలిచాయి ఈ సారి కూడా మ‌న రాష్ట్రం నుంచి వివిధ కేట‌గిరీల్లో 600 ల‌కు పైగా ఎంట్రీల‌ను పంపింది క‌చ్చితంగా అనేక అవార్డుల‌ను సాధించి తీరుతామ‌నే న‌మ్మ‌కం ఉంది కేంద్రం నిర్ణ‌యించిన పారా మీట‌ర్ల‌లోనే ఇవ్వాళ అవార్డులను ఎంపిక చేశాం కాబ‌ట్టి ఈ ఏడాది అక్టోబ‌ర్ 2వ తేదీన రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా మ‌రిన్నిఅవార్డుల‌ను ఇక్క‌డున్న వారేగాక ఇంకా చాలా మంది తీసుకుంటారని ఆశిస్తున్నాను సీఎం కెసిఆర్ మాన‌సిక పుత్రిక ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి సాధించిన ఫ‌లితాల వ‌ల్లే ఇది సాధ్య‌మైంది ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్రమం దేశంలోనే వినూత్న‌మైన‌ది గాంధీజీ క‌ల‌లు గ‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని, తెలంగాణ గాంధీగా సీఎం కెసిఆర్ చేసి చూపించారు అందుకే ఇవ్వాళ దేశానికి మ‌న ప‌ల్లెలు ఆద‌ర్శంగా నిలుస్తున్నాయి కేంద్ర గ్రామీణాభివృద్ధి మ‌రియు జ‌ల శ‌క్తి మంత్రిత్వ శాఖలు 2018 నుండి “స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ‌” అవార్డుల కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లోని పారిశుధ్య నిర్వహణను పరిశీలించి, జిల్లాలకు జాతీయ స్థాయి ర్యాంకుల‌ను ప్రకటిస్తున్నారు. 2 అక్టోబర్, 2023 తేదీన జాతీయ స్థాయిలో మ‌రోసారి అవార్డుల వేడుకను నిర్వహిస్తున్న‌ది. బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న ర‌హిత‌, పారిశుద్ధ్యంలో గ్రామాలు, మండ‌లాలు, జిల్లాలు, రాష్ట్రాల మ‌ధ్య ఆరోగ్య క‌ర‌మైన పోటీని, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని పెంచుతూ, ఈ అవార్డుల‌ను కేంద్రం ఇస్తున్న‌ది రాష్ట్రంలోని అన్నిగ్రామ పంచాయితీలు,తమగ్రామాల స్వీయ అసెస్‌మెంట్‌ను రెండు సార్లు పూర్తి చేశాయి. థర్డ్ పార్టీ ఏజెన్సీ ప్రత్యక్ష పరిశీలనలో పొందిన మార్కుల ఆధారంగా, జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలు, ఉత్త‌మ మండ‌లాలు, ఉత్త‌మ జిల్లాలు మరియు ఉత్త‌మ రాష్ట్రాలకు స్వచ్ఛ భారతి దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 2, 2023 న న్యూ ఢిల్లీలో కేంద్రం అవార్డులను అంద చేస్తుంది. గ‌తంలో కంటే ఎక్కువ అవార్డులు ఈ సారి రావాల‌ని ఆకాంక్షిస్తున్నాను రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిన వారికి, రేపు పొందే వారికి ముందుగానే శుభాకాంక్ష‌లు! అభినంద‌న‌లు!! ఈ కార్యక్రమంలో….
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, సె ర్ఫ్ సీఈవో గౌతం, స్పెషల్ కమిషనర్ ప్రదీప్, ఎస్ బి ఎం డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, యూనిసెఫ్ డైరెక్టర్ వెంకటేష్, అవార్డులు స్వీకరించడానికి వివిధ గ్రామాలు మండలాలు జిల్లాల నుంచి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు, జెడ్పి సీఈవోలు, డి ఆర్ డి ఓ లు డిపిఓలు ఎంపీడీవోలు, ఎంపీ ఓలు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News