cobra snake found at wash room: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పాములు జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ 16 అడుగుల పొడవనున్న గిరి నాగు ఓ ఇంటి బాత్రూమ్ లో తిష్ట వేసి కూర్చుని ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియోలోకి వెళ్తే..ఏపీలోని మన్యం జిల్లా కురపాం మండలం కిచ్చాడ అనే గ్రామంలో స్థానికంగా నివాసం ఉంటున్న శివ అనే వ్యక్తి ఎర్లీ మార్నింగ్ బాత్రూమ్ కు వెళ్దామని ఇంట్లోని వాష్ రూమ్ డోర్ తీశాడు. అతడు బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే.. భయంకరమైన 16 అడుగుల కింగ్ కోబ్రా అతడు కళ్లెదుటే కూర్చుని ఉంది. దీంతో అతడికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. వెంటనే భయంతో బయటకు పరుగులు తీసిన అతడు చుట్టుపక్కల వారితోపాటు అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారమిచ్చాడు.
దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఆ భారీ గిరి నాగును పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఆ పాము భయంకరంగా బుసలు కొడతూ.. ఫారెస్ట్ సిబ్బందికి చుక్కలు చూపించింది. అక్కడున్న వారంతా కూడా భయంతో పరుగులు తీశారు. కొన్ని గంటలు పాటు శ్రమించి చివరకు ఎంతో చాకచక్యంగా కింగ్ కోబ్రాను బంధించారు అధికారులు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ విష సర్పాన్ని తీసుకెళ్లి దగ్గరలోని అడవిలో విడిచిపెట్టారు. ఈ మెుత్తం తతంగాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Viral Video – ఏం గుండె ధైర్యం సామీ నీది.. ఏకంగా నోటితో మొసలికి మాంసం తినిపించావ్..!
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తూ ఉండటంతో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాములు ఇళ్లలోకి వచ్చేసి ఎక్కడెక్కడ నక్కి మనల్నే కాటు వేసే ప్రమాదం ఉంది. చిన్న పిల్లలు ఉన్నవారు మరింత అలర్ట్ గా ఉండాలి. మీ ఇంట్లో పాము దూరితే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి. ఒక వేళ పాము కాటు వేస్తే.. ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోండి.


