Saturday, November 15, 2025
HomeTop StoriesDivorce Celebrations : ఘనంగా విడాకుల వేడుక.. వైరల్ అవుతున్న వీడియో!

Divorce Celebrations : ఘనంగా విడాకుల వేడుక.. వైరల్ అవుతున్న వీడియో!

Divorce Celebrations video viral: మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ వ్యవస్థలతో సైతం అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు వివాహంతో పాటు విడాకులు కూడా చాలా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రెటీల వరకు విడాకులతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే విడాకులు అనేవి ఎంతో బాధాకరమైన విషయం. కానీ మారుతున్న ట్రెండ్ ప్రకారం చూస్తే.. నేటి యువత విడాకులను కూడా ఓ వేడుకలా చేసుకుంటున్నారు. ఇలాంటి వేడుకకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తున్న నెటిజెన్లు ..నువ్వు తోపురా మామా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

హ్యాపీ డివోర్స్: బీరాదర్ డీకే అనే వ్యక్తికి ఇటీవల తన భార్య నుంచి చట్టపరంగా విడాకులు పొందాడు. అయితే తాను బాధపడకుండా హాప్పీగా ఫీల్ అయ్యాడు. తన ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి అతను వినూత్నంగా వేడుకలను సైతుం జరుపుకున్నాడు. బంధుమిత్రుల హర్షధ్వానాల నడుమ తన తల్లితో పాలతో అభిషేకం చేయించుకుని తను ఇప్పుడు ఎంతో ఆనందపడుతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ‘హ్యాపీ డివోర్స్’ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేసి తన కొత్త జీవితానికి స్వాగతం పలికాడు.

Also read:https://teluguprabha.net/viral/ai-romance-video-trending-on-social-media/

మిమ్మల్ని మీరు గౌరవించుకోండి: హ్యాపీ డివోర్స్ వేడుకకు సంబంధించిన వీడియోను బీరాదర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. అంతే కాకుండా ఆ వీడియోకు క్యాప్షన్‌ను సైతం ఇచ్చాడు. దయచేసి నాలా మీరు కూడా సంతోషంగా ఉండండి. మిమ్మల్ని మీరు నిరంతరం గౌరవించుకోండి. అస్సలు కుంగిపోవద్దు. నేను 120 గ్రాముల బంగారంతో 18 లక్షల నగదు తీసుకోలేదు. వాళ్లకే ఇచ్చాను. ఇప్పుడు ఒంటరిగా, చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితం.. నా నిబంధనలు” అంటూ ఒక క్యాప్షన్ జోడించాడు.

నువ్వు తోపురా మామ: ఆయితే ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్ర‌మ‌ స్పందనలు వ‌స్తున్నాయి. కొందరు విడాకుల తర్వాత కూడా ఇంత సానుకూలంగా ఉండటాన్ని అభినందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉన్నందుకు అతడిని ప్రశంసింస్తున్నారు. ఆ వీడియో చూస్తున్న నెటిజెన్లు ..నువ్వు తోపురా మామా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం విడాకుల వంటి సున్నితమైన విషయాన్ని ఇలా బహిరంగంగా వేడుకలా జరుపుకోవడం సరైనది కాదని విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad