Indian Tourist Tiger Attack Video: సాధారణంగా జూ పార్క్ సందర్శనకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ అక్కడి అద్భుతమైన జంతువులతో జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. మరికొంత మంది ప్రాణాల తెగించి ప్రమాదకరమైన జంతువుల వద్దకు వెళ్లి వీడియోలు కూడా చేస్తారు. కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మీ వెన్నుపూసలో వణుకు పుట్టడం ఖాయం. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ తెలుసుకోండి..
వీడియోలో..
వీడియోలో ఒక వ్యక్తి పులి మెడకు కట్టిన లీష్‌ను పట్టుకొని వాకింగ్ చేస్తుంటాడు. అతడిని మరో వ్యక్తి వీడియో తీస్తూంటాడు. ఆ వ్యక్తి పులిని నిమురుతూ పక్కన కూర్చుని ఫొటో తీసుకోవడానికి కిందకు వంగగా జూ కీపర్ పులిని కర్రతో కూర్చోమని సూచన ఇస్తుంటాడు ఇంతలో కోపంతో ఊగిపోయిన పులి వెంటనే కింద కూర్చొని ఉన్న వ్యక్తి మీదకు దూకి దాడి చేసింది. ఆ వ్యక్తిని రక్షించడానికి జ్యూ కీపర్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. వీడియోలో వ్యక్తి ఆరుపులు విపిస్తాయి. ఈ వీడియోను @kumarr_raj అనే వ్యక్తి X వేదికగా పోస్ట్ చేసిన నిమిషంలో వైరల్ అయ్యింది. ఈ ఘటన థాయిలాండ్ లోని ఓ జ్యూ ప్కార్‌లో జరిగింది. పోస్ట్ చేసిన కొంది నిమిషాల్లో నెట్టిజన్‌లు షాక్‌కు గురయ్యారు. మరికొందరు ప్కార్ యాజమాన్యం తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
An Indian tourist was reportedly attacked by a tiger at a petting zoo where big cats are kept for selfies and feeding.#TigerAttack #ThailandNews #AnimalAbuse #IndianTourist pic.twitter.com/5ZKhTvvGNg
— Rajesh Kumar 🇹🇭🇮🇳 (@kumarr_raj) May 30, 2025
ఈ మధ్యకాలంలో రీల్స్ మోజులో చాలా మంది వింత చేష్టలు చేస్తున్నారు. ఓవర్‌నైట్ స్టార్‌డమ్ కోసం ప్రాణాలనూ లెక్కచేయకుండా ప్రమాదకరమైన సాహసాలు చేస్తున్నారు. ఇలాంటి వారికి గట్టి బుద్ధి చెప్పాలిని నెట్టిజన్‌లు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిక తగిన గుణపాఠం చెప్పడం, వారిలో మార్పు తీసుకురావడం చాలా అవసరం. లేకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.


