Saturday, November 15, 2025
Homeవైరల్Ziva: పదేళ్ల చిన్నారిలో ఇంత గొప్ప ఆలోచనలా.. వైరల్‌ అవుతున్న ధోనీ కూతురు వీడియో

Ziva: పదేళ్ల చిన్నారిలో ఇంత గొప్ప ఆలోచనలా.. వైరల్‌ అవుతున్న ధోనీ కూతురు వీడియో

MS Dhoni Daughter Ziva Video: ఈ కాలంలో ఎవరినైనా సరే మీరేం కావాలనుకుంటున్నారని అడిగితే.. ఏ మాత్రం తడబడకుండా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనో, డాక్టర్‌, యాక్టర్‌, విదేశాల్లో ఉద్యోగం, వారసత్వంగా వస్తున్న బిజినెస్‌ చేయడం అనో.. ఇలా తప్పకుండా చెబుతారు. కానీ భారత క్రికెట్‌ దిగ్గజం ఎంఎస్‌ ధోనీ కూతురు మాత్రం అలా కాదు. పదేళ్ల వయసులోనే ఈ చిన్నారి ఆలోచనలు ఎంతో పరిపక్వత చెందాయి. సమాజం పట్ల బాధ్యత, తండ్రి గొప్పతనం.. ఇవన్నీ చిన్న వయసులోనే పెద్దగా ఆలోచించేలా చేశాయి. ఎంతకీ తాను కావాలనుకుంటుందో తెలుసా.. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/heavy-rains-in-andhra-pradesh-next-four-days-due-to-montha-cyclone/

ఎంఎస్‌ ధోనీ, సాక్షిల ఏకైక కుమార్తె జీవా.. చిన్నప్పటి క్యూట్‌ ఫొటోస్‌ గతంలో నెట్టింట్లో చాలా హల్‌చల్‌ చేశాయి. ధోనీ, సాక్షిలకు 2010లో వివాహం కాగా.. 2015లో ఈ జంటకు జీవా జన్మించింది. కాగా, శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడితో జరిగిన సంబాషణలో జీవా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 

Also Read: https://teluguprabha.net/cinema-news/rashmika-mandanna-acted-inthe-girlfriend-movie-without-remuneration/

నువ్వు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావని సదరు రాజకీయ నాయకుడు జీవాను అడగ్గా.. తాను పెద్దయ్యాక ప్రకృతి శాస్త్రవేత్త(నేచురలిస్ట్‌) కావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ఆయన జీవాను మెచ్చుకున్నారు. చాలా గొప్పగా ఆలోచిస్తున్నావంటూ అభినందించారు. జీవాను ఆశీర్వదించారు. ఈ వీడియో వైరల్‌ అవుతుండగా.. నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. పదేళ్ల చిన్నారికి ఇలాంటి ఆలోచనలు, కోరికలు ఉండటం ఆనందం అంటూ అభినందించారు. చాలా గొప్ప మనిషి అవుతుందంటూ దీవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad