Cobra Snake on bridge in kamareddy: గత కొన్ని రోజులగా తెలంగాణను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఈ భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా ఎన్నడూ చూడని విధంగా వరదను చూసింది. ఆ జిల్లా వ్యాప్తంగా నదులు, చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. నీటి ప్రవాహానికి వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. వీధులన్నీ నీటమునిగాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో కామారెడ్డి నుంచి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలకు ఓ నాగుపాము కొట్టుకువచ్చింది. అది ఎక్కువ సేపు నీళ్లలో ఉండలేక ఓ బ్రిడ్జిపైకి ఎక్కి పడగవిప్పి కూర్చొంది. అది చూడటానికి చాలా పెద్దగా ఉంది. బుసలు కొడుతూ ఉండటంతో దానివైపు వెళ్లడానికి ప్రజలు భయపడి దూరంగా చూస్తూ ఉండిపోయారు. అక్కడున్న కొంత మంది ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. ఈపాము చాలా ప్రమాదకరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
భారీ వర్షాలకు వరదనీళ్లలో కార్లు, బైక్స్ తోపాటు మూగ జీవాలు కూడా కొట్టుకువస్తున్నాయి. ఆవులు, గేదెలు, పాములు, మెుసళ్లు వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గత ఐదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడితెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్లలోకి పాములు వచ్చే అవకాశం ఉంది. అవి ఇళ్లలో ఎక్కడిపడితే అక్కడ నక్కి మనుషుల ప్రాణాలను తీసే అవకాశం ఉంది. పాములు కాటువేస్తే సొంత వైద్యం చేయకుండా దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లండి. పాము దూరితే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి.
Also Read: Viral video -యువకుడిని కార్నర్ చేసిన వందలాది నాగుపాములు.. కట్ చేస్తే..!


