Saturday, November 15, 2025
Homeవైరల్Viral: రీల్ కోసం ఇంత రిస్క్ అవసరమా బ్రదర్... ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..

Viral: రీల్ కోసం ఇంత రిస్క్ అవసరమా బ్రదర్… ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..

Car stunt at tourist Place in Maharashtra: సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేందుకు యువత చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఎంతటి రిస్క్ చేసైనా సరే ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో జరిగిన ఈఘటన యువకుడి ప్రాణాలమీదకు తీసుకొచ్చింది.

- Advertisement -

మహరాష్ట్ర కరాడ్ లోని గోలేశ్వర్ కు చెందిన సాహిల్ జాదవ్, తన ఫ్రెండ్స్ తో కలిసి పఠాన్-సదావాఘాపూర్ మార్గంలోని కొండపైకి ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో సాహిల్ రీల్ చేయడానికి ప్రయత్నించాడు. ఇందు కోసం ఓ సాహసానికి పూనుకున్నాడు. రీల్ మోజులో పడి.. అతడు కొండ చివరన కారుతో స్టంట్ చేయడం ప్రారంభించాడు. కారు అదుపు తప్పడంతో 300 అడుగుల లోయలో జారీ పడింది. ప్రమాదంలో సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అయితే ఈ పర్యాటక ప్రాంతం గుజర్వాడి దగ్గర గల పఠాన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ సందడి సందడిగా ఉంటుంది. రోజూ వందల మంది టూరిస్టులు వస్తున్న ఈ ప్రదేశంలో సేప్టీ పెద్దగా లేదు. గతంలోనూ ఇక్కడ ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో భద్రతా రెయిలింగ్లు, హెచ్చరిక బోర్డులను వెంటన అక్కడ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. టూరిస్ట్ ప్లేస్ ల్లో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయెుద్దంటూ పోలీసులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెర్లు కొడుతోంది. రీల్స్ వ్యామోహంలో పడి ప్రాణాలు పొగోట్టుకోకండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Man Proposing To Girlfriend By Waterfall- జలపాతం దగ్గర లవ్ ప్రపోజ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad