Pakistan Flood Fury: పొరుగు దేశం పాకిస్తాన్‌ను భారీ వర్షాలు అతలాకుతులం చేస్తున్నాయి. ఈ వరదలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ క్రమంలో ఈ వరదలను కవర్ చేయడానికి వెళ్లిన ఓ పాక్ రిపోర్టర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే.. దాయాది దేశంలోని రావల్పిండిలో కుండపోత వర్షాలను వణికిస్తుండటంతో దానిని కవర్ చేసేందుకు ఓ న్యూస్ ఛానెల్ అక్కడికి వెళ్తుంది. ఈ నేపథ్యంలో చాహన్ ఆనకట్ట సమీపంలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉందని తెలిసి కూడా ఓ రిపోర్టర్ నీటిలోకి దిగి మరీ లైవ్ రిపోర్టింగ్ చేశాడు. చేతిలో మైక్రోఫోన్ పట్టుకుని..నీరు మెడ వరకు వచ్చిన కూడా అతడు రిపోర్టింగ్ చేస్తూనే ఉన్నాడు. ఆ దృశ్యాలు తాజాగా వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంత రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఫేక్ వీడియో అంటూ మరికొందరు అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, అతడు వరద నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.
⚡ A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water. pic.twitter.com/psQsgDMsFI
— OSINT Updates (@OsintUpdates) July 17, 2025
పాకిస్తాన్‌లో కురుస్తున్న వర్షాలకు గత 24 గంటల్లో 54 మంది మరణించారని అక్కడి అధికారులు గురువారం (జూలై 17) ప్రకటించారు. ఈ మరణాలన్నీ పంజాబ్ ప్రావిన్స్‌లోనే చోటుచేసుకున్నాయి. జూలై 1 మరియు జూలై 15 మధ్య గత సంవత్సరం ఇదే కాలం కంటే 124% ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు తెలియజేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆకస్మిక వరదలే దీనికి కారణంగా తెలుస్తోంది. పాకిస్తాన్ జూలై 2024లో ఇదే కాలంతో పోలిస్తే జూలై 2025లో 82 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని పాకిస్తాన్ వాతావరణ శాఖను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ నివేదించింది.
Also Read: Snakes Revenge- పాములు పగబట్టడం నిజమేనా?
పంజాబ్‌లోని జీలం జిల్లాలోని కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో అధికారులు పడవలను ఉపయోగించి వందల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలు కొనసాగుతున్నందున స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేశిది. ఈ వర్షాలకు కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో టూరిస్టులు ప్రయాణాలకు మానుకోవాలని సూచించారు. రాజధాని ఇస్లామాబాద్, పీవోకే మరియు దేశంలోని ఇతర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.


