Cobra Snakes lip lock Viral Video: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాముల వీడియోలకు మాంచి డిమాండ్ ఏర్పడింది. కింగ్ కోబ్రాలు, ఆనకొండలు, కొండచిలువల వీడియోలకు నెటిజన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. నెట్టింట వెతికి వెతికి మరీ ఈ వీడియోలు చూస్తున్నారు. మనం పాములు తోటి సర్పాలతో సయ్యాటలాడటం చూసే ఉంటాం. కానీ లిప్ లాక్ పెట్టుకోవడం పెద్దగా చూసి ఉండం. కానీ ఇక్కడ రెండు నాగుపాములు మనుషులు కిస్ పెట్టుకున్నట్లే లిప్ లాక్ చేసుకున్నాయి. ఈ రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ నాగుపాము పడగెత్తి కింద కూర్చుని ఉంటుంది. ఇంతలో పైనుంచి వచ్చిన మరో సర్పం దాని కళ్లలో చూస్తూ లిప్ లాక్ పెడుతోంది. ఈ అందమైన దృశ్యాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘ఫీలింగ్స్ మనుషులకేనా.. సర్పాలకు ఉండవా..’ అంటూ సిల్లీ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Man Proposing To Girlfriend By Waterfall- జలపాతం దగ్గర లవ్ ప్రపోజ్
View this post on Instagram
వానకాలంలో పాములు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. బెడ్రూమ్ ల్లో, కిచెన్ ల్లో, టాయిలెట్స్ లో, బైక్ డిక్కీల్లో, షూ ల్లో ఎక్కడ పడితే అక్కడ నక్కేస్తాయి. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న అవి మనల్ని కాటేస్తాయి. ఒక వేళ మనల్ని పాము కాటువేసినట్లయితే అది విషపూరితమైనదా లేదా విషరహితమైనదా అనేది తెలుసుకోవాలి. అంత నాలెడ్జ్ లేకపోతే వెంటనే దగ్గరో ఉన్న డాక్టర్ ను సంప్రదించి యాంటీ వీనమ్ తీసుకోవాలి. మీరు ఆలస్యం చేసిన కొద్దీ మీ ప్రాణాలకే ముప్పు. ఇంట్లోకి పాముదూరితే మీకు పట్టుకోవడం రాకపోతే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి. చుట్టూ పచ్చదనం, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తరుచూ శుభ్రం చేసుకోండి.


