Saturday, November 15, 2025
Homeవైరల్Viral News:పాములందు..ఈ పాము చాలా సంస్కారవంతమైనది

Viral News:పాములందు..ఈ పాము చాలా సంస్కారవంతమైనది

Snake Viral Video:సోషల్ మీడియా రోజుకో కొత్త వీడియోలు వస్తూనే ఉంటాయి. ప్రతిరోజూ వేల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతున్నప్పటికీ, అందులో కొన్ని ప్రత్యేకంగా వైరల్ అవుతాయి. వాటిలో జంతువుల ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా పాములు, సింహాలు, పులులు, మొసళ్లు వంటి వన్యప్రాణులు ఏదో ఒక రకంగా వైరల్ కంటెంట్‌లో భాగమవుతూనే ఉంటాయి. తాజాగా ఒక పాము చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి వైరల్‌ అవుతుంది.

- Advertisement -

వీడియోను షేర్ చేయగా..

ఒక యూజర్ తన ఎక్స్ (మునుపటి ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేయగా, క్షణాల్లోనే ఇది ఇంటర్నెట్‌ను ఊపేసింది. వీడియోలో ఒక స్మార్ట్‌ఫోన్‌ను స్టాండ్‌పై పెట్టి ప్లే చేశారు. ఆ ఫోన్‌లో ఓ భోజ్‌పురి పాట వినిపిస్తోంది. స్క్రీన్‌పై హీరో, హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఒక పాము అక్కడికి వచ్చి, ఆ ఫోన్ వైపు చూసి కాసేపు గమనించింది.

ఆడియోని ఆపేసింది..

ఆ తర్వాత ఆ పాము తన నాలుకను ఫోన్ వైపు చాపి, ఆడియోని ఆపేసింది. పాట ఆగిపోవడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఆ పాము అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూసినవారు పాము ప్రవర్తనను సంస్కారవంతమైనదిగా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా పాములు మనుషుల పరిసరాలకు వస్తే భయమే కలిగిస్తాయి కానీ, ఈ వీడియోలో పాము చేసిన పనిని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.

ఈ వీడియో నిజంగా జరిగిందా లేక ఏదైనా ఎడిట్ చేసిన ఏఐ క్రియేషన్ అన్న సందేహం కూడా నెటిజన్లలో వ్యక్తమవుతోంది. అయినప్పటికీ వీడియో అందరినీ ఆకట్టుకుంది. షేర్ చేసిన క్షణం నుంచి ఇప్పటివరకు కొన్ని లక్షల వ్యూస్ దక్కించుకుంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/meaning-of-seeing-elephant-in-dream-according-to-dream-science/

నెటిజన్లు తమ తమ శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు “నాగబాబాకు ఈ పాట అస్సలు నచ్చలేదు అనుకుంటా” అంటూ సరదాగా రాశారు. మరికొందరు “నాగరాజు ఈ పాటకు ఇచ్చిన రివ్యూ ఇదే” అంటూ హాస్యాస్పదంగా స్పందించారు. ఇంకొందరు ఇది సంస్కారవంతమైన పామని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad