Traffic Police Viral video: సాధారణంగా మనలో చాలా మంది రోడ్లపై ఇష్టమెుచ్చిన రీతిలో ప్రవర్తిస్తుంటారు. ఏదో కొంప మునిగిపోయే పని ఉన్నట్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి మరీ వెహికల్స్ నడిపేస్తుంటారు. రెడ్ సిగ్నల్ ను లెక్కచేయకుండా వీళ్ల లైఫ్ ని రిస్క్ లో పెట్టడమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా డేంజర్ లోకి నెట్టేస్తారు. తాగి డ్రైవ్ చేయడం తప్పు అని తెలిసినా అదే చేస్తారు. మరికొందరు రాంగ్ రూట్ లో వచ్చిందే కాకుండా ఇతరులపై వాగ్వాదాలకు దిగుతారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ఇలాంటిదే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ట్రాఫిక్ పోలీసు చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. మా దగ్గర కూడా ఇలాంటిది వస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? అంత గొప్పగా ఆ ట్రాఫిక్ పోలీసు ఏం చేశాడో? తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఈ ఘటన ఆఫ్రికాలో జరిగినట్లు తెలుస్తోంది.
Much needed in India as well….. pic.twitter.com/e5eXIoP1m4
— Mr Sinha (@MrSinha_) July 13, 2025
వీడియోలోకి వెళితే.. ఇందులో ట్రాఫిక్ సిగ్నల్ పడినా ఇద్దరు వ్యక్తులు జీబ్రా క్రాసింగ్ లైన్స్ దాటి ముందుకు వెళతారు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు వెనకాల వచ్చి బండి పైకి ఎక్కి తన చేతిలో ఉన్న స్టిక్ తో అతడి హెల్మెట్ పై బాదుతూ ఉంటాడు. దాంతో షాక్ అయిన ఆ ద్విచక్రవాహనదారుడు బైక్ ను వెనక్కు మరలిస్తాడు. వాహనాన్ని వెనక్కు మరలించేదాకా కానిస్టేబుల్ కొడుతూనే ఉంటాడు. ఆ దృశ్యాన్ని గమనించిన తోటి వాహనదారులు నిబంధనలు అతిక్రమించకుండా అక్కడే ఆగిపోతారు.
ఈ మెుత్తం ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను ఎనిమిది లక్షల మందికిపైగా వీక్షించారు. వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఇలాంటి రూల్స్ తమ దేశంలో కూడా వస్తే బాగుండు కదాని కొంత మంది అంటుంటే..జీబ్రా టాస్క్ ఫోర్స్ పోలీస్ అంటే ఇతనే అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి దేశంలో ఇలాంటి పోలీస్ ఒకరుండాలి అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మెుత్తానికి ఆ ట్రాఫిక్ పోలీసు చేసిన పని నలుగురికి ఆదర్శంగా నిలిచింది.


