viral news in Telugu: గత కొన్ని రోజులగా పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఎక్కువగా చక్కెర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అనకొండ, కింగ్ కోబ్రాలకు వీడియోలకు నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. తాజాగా పాములకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. స్నేక్ క్యాచర్ ఇంట్లోని పదుల సంఖ్యలో పాములు కనిపించడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశా పూరి జిల్లాలోని కాకత్‌పూర్ బ్లాక్ పరిధిలోని కుండే పంచాయతీ వాసి అయిన బ్రజ్ కిషోర్ సాహు పాముల పట్టడంలో దిట్ట. రెండు నెలల కిందట ఇతడు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఇంట్లో కింగ్ కోబ్రాను పట్టుకుని రక్షించాడు. అతను ఆ పామును ఇంటికి తీసుకెళ్లి మరుసటి రోజు సమీపంలోని అడవిలో వదలాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ సమయంలో ఆ నాగుపాము గర్భవతిని తెలిసి దానిని తన ఇంట్లోనే ఓ ఫ్లాసిట్ జాడిలో సురక్షితంగా ఉంచాడు. రెండు రోజుల తర్వాత ఆ ఆడ నాగుపాము 19 గుడ్లును పెట్టింది. వెంటనే బ్రజ్ కిషోర్ సాహు ఆ పామును దగ్గరలో ఉన్న అడవిలో వదిలేశాడు.
Also Read: Viral Video – డ్రైవర్‌కు మూర్చ.. గాల్లోకి ఎగిరిన కారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీ కోసం..!
అయితే సాహు దాదాపు రెండు నెలలపాటు ఆ గుడ్లను కంటికి రెప్పలా కాచుకున్నాడు. సరిగ్గా మూడు రోజుల కిందట అంటే సెప్టెంబరు 12 శుక్రవారం నాడు ఆ గుడ్ల నుండి 19 పాము పిల్లలు బయటకు వచ్చాయి. అయితే ఇవి చాలా విషపూరితమైనవి సాహూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఆ పాము పిల్లలను ప్లాస్టిక్ జాడి నుండి జాగ్రత్తగా బయటకు తీశారు. తరువాత, బ్రజకిషోర్ అటవీ శాఖకు సమీపంలోని గోలర్‌గడ అడవిలో అన్ని పాము పిల్లలను విడిచిపెట్టమని సమాచారం ఇచ్చాడు. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్స్ షాక్ కు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Also read: Viral: – ఆ మహిళకు 60 రొట్టెలు తిన్నా ఆకలి తీరడం లేదు.. ఈ వింత రోగం ఎక్కడంటే?
అయితే పాములన్నీ విషపూరితం కావు. అందుకే కొన్ని జాతుల పాములు కాటు వేసినా ఎటువంటి హాని జరగదు. పాముల ప్రవర్తన, నివాసం, రంగు, తలను బట్టి అది విషపూరితమా కాదా అనేది తెలుసుకోవచ్చు. రాటిల్ స్నేక్ తన ప్రవర్తన ద్వారా ముందుగానే హెచ్చరికలు పంపుతుంది. కొన్ని పాములు నీరు ఉన్న ప్రాంతాల్లో ఉంటూ కప్పలు, చేపలు, ఇతర చిన్న జీవులను తింటూ ఉంటాయి. ఇవి అంత ప్రమాదకరం కాదు. త్రిభుజాకారపు తల ఉన్న పాముల్లో విష గ్రంధులు ఉంటాయి. ఇవి చాలా డేంజర్. పాము కాటువేసిన తర్వాత చర్మంపై రెండు గాట్లు ఉంటే అది విషపూరితమైనది.


