Jasmine Jaffar Instagram Reel Controversy:కేరళలోని ప్రసిద్ధ గురవాయిర్ శ్రీ కృష్ణాలయంలో మాజీ బిగ్ బాస్ బ్యూటీ, ఇన్‌ఫ్లుయెన్సర్ జాస్మిన్ జాఫర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వివాదాస్పదమైంది. దీంతో గుడిని శుద్ధి చేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. ఆరు రోజులపాటు ఈ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 18 రకాల పూజలు, 18 రకాల శ్రీవేలీలు ఉంటాయన్నారు. నేటి ఉదయం నుంచి ఈ కార్యక్రమం మెుదలుకానుంది. పరిమితంగా దర్శనాలకు అనుమతించనున్నారు.
జాస్మిన్ ఆలయంలోని పవిత్రమైన చెరువులో తన పాదాలను కడుగుతున్నట్లు వీడియోలో చూపించారు. ఈ చర్య భక్తులకు, ఆలయ అధికారులకు తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఇది తమ ఆచారాన్ని దెబ్బతీయడమే కాకుండా మతపరమైన భావాలను ఉల్లంఘించడమేనని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఆలయ కొనేరులో ఉత్సవమూర్తి విగ్రహాలకు స్నానం నిర్వహించేందుకు ఆరట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాంటి నీటిలో జాస్మిన్ పాదాలు కడగడం అరిష్టంగా భావిస్తున్నారు. జాస్మిన్ జాఫర్ హైకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించి ఆలయంలోని పవిత్ర ప్రాంతాల్లో వీడియోను చిత్రీకరించారని గురవాయుర్ దేవస్థానం బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ అధికారులు, భక్తుల నిరసన వెల్లువెత్తుడంతో జాస్మిన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. నా అజ్ఞానం వల్లే ఇది జరిగిందని.. ఎవరినీ కించపరచాలనే తనకు లేదని ఆమె పేర్కొంది.
Also Read:Viral – యువతిని అసభ్యంగా తాకిన ఆలయ పూజారి.. వైరల్ గా మారిన వీడియో..


