Sunday, November 16, 2025
Homeవైరల్Chhattisgarh: హాయిగా బురదలో ఆడుకుంటున్న ఏనుగుల గుంపు.. వైరల్ గా మారిన వీడియో..

Chhattisgarh: హాయిగా బురదలో ఆడుకుంటున్న ఏనుగుల గుంపు.. వైరల్ గా మారిన వీడియో..

Viral Video Today: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది. ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అయితే ఈ మధ్య నెట్టింట ఎక్కువగా జంతువులు వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రాలు, పులులు, ఏనుగులు, సింహాలు వీడియోలకు ప్రజల నుంచి ఎక్కువగా ఆదరణ వస్తుంది. దీంతో నెటిజన్స్ కూడా వాటి కంటెంట్ ను అధికంగా నెట్లో డంప్ చేస్తున్నారు. వీటిలో ఏ మాత్రం ఢిపరెంట్ గా ఉన్న ఆ వీడియో వైరల్ అయిపోతుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంది.

- Advertisement -

వీడియోలోకి వెళ్తే.. వర్షాకాలం కావడంతో ఇందులో ఒక ఏనుగుల గుంపు బురదలో ఆడుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా జాలీగా ఎంజాయ్ చేస్తూ సేదతీరుతాయి. ఇందులో ఒకదానిపై ఒకటి మట్టి వేసుకుంటూ.. తొండలతో కొట్టుకుంటూ సరదాగా గడుపుతున్నాయి. బురదలో ఆడుకుంటున్న ఏనుగుల గుంపును రాయ్‌గఢ్ అటవీ శాఖ డ్రోన్ లో బంధించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని ధరమ్‌జైగఢ్ ఫారెస్ట్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. దీనిపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తుంది. ఇప్పటివరకు 42వేల మందికిపైగా వీక్షించారు.

ఈ భూమ్మీద అతి పెద్ద జంతువు ఏనుగు. గజరాజు 70 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది. దీని గర్భావధి కాలం 22 మాసాలు. ఏనుగుల్లో రెండు రకాలు ఉన్నాయి. అవే ఆఫ్రికా ఏనుగు, ఆసియా ఏనుగు. ఇందులో ఆఫ్రికా ఏనుగులు చాలా పెద్దవి. ఇవి పెద్ద పెద్ద చెవులు, దంతాలను కలిగి ఉంటాయి. ఆసియా ఏనుగులు చిన్న సైజులో ఉంటాయి. పైగా వాటి జనాభా కంటే చాలా తక్కువ. మన దేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగం.. చాలా దైవ కార్యక్రమాల్లో ఏనుగు పాల్గొంటుంది. పూర్వ కాలంలో రాజులు ఏనుగుల మీద యుద్ధాలు చేసేవారు. దీనిని సర్కస్ ల్లో కూడా వాడతారు. ప్రతి ఏటా ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad