Snake Farming viral video: కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, పశువుల పెంపకం గురించి మనం వినే ఉంటాం. కానీ పాముల పెంపకం గురించి ఎప్పుడైనా విన్నారా? కానీ తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ షాకింగ్ వీడియో చైనా నుండి వచ్చినట్లు తెలుస్తోంది.
వీడియోలో మెుదట బెడ్ రూమ్ చూపించారు. అందులోని ఒక మంచం మీద పరుపు పరిచి ఉంటుంది. ఇంతలో ఓ యువతి అక్కడకు వచ్చి బెడ్ ను పైకి ఎత్తుతుంది. అంతే ఒక్కసారిగా వందలాది పాములు దాని నుంచి కిందకు దిగుతాయి. అంతేకాకుండా ఆ యువతి బెడ్ ను శుభ్రంగా క్లీన్ చేసి..యథావిధిగా పరుపును సెట్ చేస్తోంది. యువతి బెడ్ రూమ్ లో పాముల పెంచడం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఇంకెందుకు అలస్యం మీరు కూడా చూసేయండి.
చాలా మంది కుక్క పిల్లలు పెంచుకోవడం చూశాం. కానీ ఇలాంటి పాములను పెంచుకోవడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. పాముల విషం కోసం చైనా, వియత్నాంలో స్నేక్ ఫామింగ్ చేస్తారు. భారీ సంఖ్యలో సర్పాలను పెంచి.. వాటి విషాలను తీసి సాంప్రదాయ మందులు మరియు యాంటీవీనమ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇక వియత్నాంలోని డాంగ్ టామ్ స్నేక్ ఫామ్ అయితే 12 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ వందలాది జాతులకు చెందిన పాములను పెంచుతున్నారు.
Also Read: Giri nagu video – ఇళ్ల సందులో భారీ గిరి నాగు.. అతడు జస్ట్ లో మిస్ ..లేకపోతే అంతే!
తాజాగా వైరల్ అయిన వీడియో మనకు కొత్త కావచ్చు కానీ చైనాలో కామన్ అనే చెప్పాలి. ఇక్కడ ప్రజలు పంట పొలాల్లో పాములు పెంచుతుంటారు. అందుకు విభిన్నంగా ఈ యువతి బెడ్ రూమ్ లో సర్పాలను పెంచుతుంది. చైనా యువత పాములతోపాటు బల్లులు, సాలె పురుగులు పెంచడానికి ఆసక్తి చూపుతున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి.
Also Read: Hens vs Baby cobra – రెండు భారీ కోళ్లను భయపెట్టిన బుల్లి నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?


