Mumbai’s ‘Spider-Man’ swaps web for mop: దేశాన్ని కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. నార్త్ నుంచి సౌత్ వరకు వరద విలయమే కనిపిస్తోంది. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరద కారణంగా రోడ్లన్నీకోతకు గురయ్యాయి. ఎక్కడక్కడా జనజీవనం స్తంభించింది. ఈ భారీ వర్షాలకు పలువురు జలసమాధి కూడా అయ్యారు. కొండ చరియలు విరిగపడి మరికొందరు మృత్యువాతపడ్డారు. ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు క్లౌడ్ బరస్ట్ సంభవించి పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. యానిమల్స్ కూడా కొట్టుకువస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై నుంచి వస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
రీసెంట్ గా కురిసిన భారీ వర్షాలకు ముంబై నగరం అతలాకుతులం అయింది. నగరంలో రోడ్లన్నీ నదులను తలపించాయి. పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెరైన్ డ్రైవ్ , గేట్ వే ఆఫ్ ఇండియా వంటి ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక్కడ 3.75 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. మరోవైపు ముంబై నగరాన్ని కాపాడటానికి స్పైడర్ మ్యాన్ రావాల్సి వచ్చింది. ఒక కామిక్ బుక్ లో జరిగిన సంఘటనల వలే నాటకీయంగా జరిగిందీ ఈ సంఘటన. స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి మాపుతో ముంబై వీధులను శుభ్రపరుస్తూ కనిపించాడు. వరద నీటిని బయటకు పారద్రోలుతూ హల్ చల్ చేశాడు. ఇతడు స్పైడర్ మ్యాన్ లా వెబ్-స్లింగ్ శక్తులతో కాకుండా.. వైపర్ తో వరద నీటిని తుడిచిపెడుతున్నట్లు కనిపించాడు.
Also Read: Snake on Bridge- వంతెనపై తిష్ట వేసి పడగ విప్పి కూర్చున్న భారీ నాగు పాము.. వైరల్ గా మారిన వీడియో..
అక్కడున్న కొంత మంది ఈ దృశ్యాన్ని ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త నెట్టింట ట్రెండింగ్ గా మారింది. దీనిపై లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. కొంత మంది దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. “రియల్ స్పైడర్‌మ్యాన్ ఆఫ్ ముంబై” అని ఒకరు కామెంట్ చేస్తే.. “స్పైడర్ మ్యాన్ నీటిలోకి దిగుతున్నాడు” అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియోపై కొందరు మీమ్స్ సృష్టించడంతోపాటు జోక్స్ కూడా వేస్తున్నారు. “స్పైడర్ మ్యాన్ ముంబై కో బచానే కే మిషన్ పార్” అని మరొకరు జోక్ పేల్చారు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాను అయితే ఓ ఊపు ఊపేస్తోంది.
Also Read: Variety love story -83 ఏళ్ల వృద్ధురాలిని ప్రేమించిన 23 ఏళ్ల యువకుడు.. వీరు ఎలా కలిశారో తెలుసా?


