Monday, November 17, 2025
Homeవైరల్Tigers Viral Video: ఏం గుండె రా వాడిది.. ఏకంగా పులులతోనే కారులో రైడ్ కు...

Tigers Viral Video: ఏం గుండె రా వాడిది.. ఏకంగా పులులతోనే కారులో రైడ్ కు వెళ్లాడు..

Tigers Viral Video: ఈ భూమ్మీద సింహం తర్వాత ప్రమాదకరమైన జంతువు ఏదైనా ఉందంటే అది పెద్దపులి మాత్రమే. అలాంటి టైగర్ ను దూరం నుంచి మనం వణుకుతాం. అలాంటిది ఓ వ్యక్తి మూడు పెద్ద పులులను కారులో ఎక్కించుకుని మంచు పర్వతాలపై షికారు కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

- Advertisement -

వీడియో ఓపెన్ చేస్తే.. మంచు ప్రదేశంలో ఓ వ్యక్తి కారులో కూర్చుని ఉంటాడు. ఇంతలో ఓ పెద్ద పులి అక్కడికి వస్తుంది. అంతేకాకుండా కిటికీ గుండా కారులోకి దూకి వెనుక సీట్లోకి వెళ్లి కూర్చుంటుంది. అతడు ఏమాత్రం భయపడాడు. ఇంతలో వెనకి డోర్ గుండా మరో రెండు పులులు కారులోకి వస్తాయి. ఈ మూడు వాటి సొంత కారు లాగా సీట్లు కూర్చుని ఉంటాయి. ఆ వ్యక్తి చేసేది ఏమీ లేక కారును డ్రైవింగ్ చేసుకుంటూ ఆ మూడింటిని తీసుకెళతాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. డ్రైవర్ ధైర్యానికి హాట్సాఫ్ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. అవి అతడి పెంపుడు పులులని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ వీడియోపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను వీక్షించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Nagamani Viral video- నిజమైన నాగమణిని ఎప్పుడైనా చూశారా?

సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ చూసిన జంతువులు, పాముల వీడియోలే కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఎక్కువగా స్నేక్స్, ఏనుగులు, పులులు, సింహాల వీడియోలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా అధిక సంఖ్యలో యానిమల్స్ వీడియోలను నెట్టింట డంప్ చేస్తున్నారు. వాటిలో కొంచెం డిఫరెంట్ గా ఉంటే చాలు వీడియో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. నెటిజన్స్ కూడా ఇలాంటి వీడియోలనే ఎక్కువగా చూసేందుకు ఇంట్రెస్టింట్ చూపిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad