King cobra hiding in car tyre: దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రమాదకరమైన పాములు ఇళ్లల్లో నక్కి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వీడియోలోకి వెళ్తే.. వర్షాకాలంలో పాములు వెచ్చని ప్రదేశాలను అడ్డాలుగా మార్చుకుంటాయి. ఈ క్రమంలోనే కింగ్ కోబ్రా ఓ ఇంటిలోని వేస్ట్ గా పడి ఉన్న కారు టైర్ లో నక్కింది. అది చూడటానికి భయకరంగా పసుపు రంగులో ఉంది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినవారిపై దాడి చేయటానికి యత్నించింది.
దీంతో వారు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన పాములు పట్టేవారు ఆ నాగుపామును కొన్ని గంటలపాటు శ్రమించి ఎంతో చాకచక్యంతో బంధించారు. తర్వాత ఆ పామును దగ్గరలోని అడవిలో విడిచిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ పాము చాలా డేంజర్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన నాగుపాములు, కొండచిలువలు, ఆనకొండ వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని చూసేందుకు జనాలు తెగ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్స్ పాములకు సంబంధించిన వీడియోలను పెద్ద మెుత్తంలో డంప్ చేస్తున్నారు. వీటిలో కాస్త డిఫరెంట్ గా ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కింగ్ కోబ్రాలు చాలా విషపూరితమైనవి. వీటిలో ఎన్నో జాతులు ఉన్నాయి. వైట్ స్నేక్, నీలి స్నేక్, నల్లత్రాచు, ఎల్లో స్నేక్, గిరి నాగు, కోడె నాగు.. ఇలా రకరకాల పాములు ఉన్నాయి. ఈ కోబ్రాలు దాదాపు ఇరవై అడుగుల వరకు పెరుగుతాయి. ఇవి ఒక్క కాటుతో మనిషి ప్రాణాలను సైతం తీయగలవు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పాములు బాగానే ఉన్నాయి.
Also Read: King Cobras – ఓరి దేవుడా! ఒకే చోట ఇన్ని నాగుపాములా..!
మనదేశంలో పాములను దైవంగా పూజిస్తారు. వీటికి గుర్తుగా నాగుల చవితి, నాగపంచమి వంటి పండుగలను జరుపుతారు. పురాణాలు, హిందూ మత గ్రంథాల్లో కూడా పాములకు దైవత్వం ఉందని చెప్పారు. ఈ భూమండలాన్ని ఆదిశేషుడు అనే నాగు తన తలపై మోస్తుందని.. శివుడు మెడలో ఉండే వాసుకీ అనే నాగు పాములకు రాజు అని.. ఒకప్పుడు తక్షకుడు అనే భయంకరమైన నాగు ఉండేదని గ్రంథాల్లో చెప్పబడ్డాయి.
Also Read: Also Read: Python Attack video- కొండచిలువ మింగబోతుంటే.. నీకు నవ్వు ఎలా వస్తుంది భయ్యా..!


