Friday, June 13, 2025
Homeపాలిటిక్స్Rahul Gandhi: సద్దాం హుసేన్ లా రాహుల్ గాంధీ ..సీఎం సెన్సేషనల్ కామెంట్స్

Rahul Gandhi: సద్దాం హుసేన్ లా రాహుల్ గాంధీ ..సీఎం సెన్సేషనల్ కామెంట్స్

బీజేపీ ఫైర్ బ్రాండ్ గా సెన్సేషనల్ కామెంట్స్ చేయటంలో ఎప్పటికప్పుడు మాటలకు పదును పెట్టే అస్సాం సీఎం హిమంతా బిశ్వా చేసిన లేటెస్ట్ కామెంట్స్ అందరినీ షాక్ లో ముంచెత్తుతున్నాయి. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ సద్దాం హుసేన్ లా ఎందుకు కనిపిస్తున్నారని హిమంతా బిశ్వా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తన లుక్స్ ను మార్చుకున్నారని దీంతో తమకు ఎటువంటి ప్రాబ్లెం లేదన్న హిమంత అసలు ఆయన వల్లభాయ్ పటేల్ లా లేక జవహర్ లాల్ నెహ్రూలా, గాంధీజీలా కాకుండా సద్దాంలా ఎందుకు కనిపిస్తున్నరనే ఆసక్తికర విషయాన్ని లేవనెత్తారు.

- Advertisement -

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో గుజరాత్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయన తూటాల్లాంటి మాటలను ప్రయోగించి అందరినీ ఆలోచింపజేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ దారుణ హత్యపై కూడా హిమంత నిప్పులు కురిపిస్తూ లవ్ జిహాద్ కు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News