కవితక్షరినీ శాసించి నాడు
కవుల లోకాన భాసించి నాడు
అభ్యుదయన విహరించి నాడు
అవినీతిని ఎపుడూ నినదించి నాడు
ఆంగ్లంన సకిలించు ఆంధ్రోళ్ళనందరిని
ఆ…మరణమే శరణమ్మని శాసించే కొందరిని
పరాయి మోసం పాము లాంటిదని
మనోడి మోసమే మరణ శయ్యయని
గళం ఎత్తి చాటారు లోకమంతా
కలమేత్తి రాసారు గోశనంతా
మాండలికాల తోనే మన ఉనికి నిలుపంగా
మన తెలుగు తొని బతుకంతా వెలుగంగా
ప్రజా గొడవయే తన స్వంత గొడవంటూ
నా గొడవ తొనీ మోగించే నగారా
నిశ్వార్ధానికి నిలువెత్తు రూపు కాలన్న
నిజాము బూజునే దులుపంగా కాలి కన్న
అన్ని మాటలేపుడు తూటాల రూపం
అన్న మాటలేపుడూ బతుకున దీపం
ఆలోచనా సంద్రమే మన కాళోజీ
అక్షరాల సంగ్రామమే మన కాళోజీ
Kaloji Janthi: గర్జించిన అక్షరం
అక్షరాల సంగ్రామమే మన కాళోజీ..