Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: వరద బాధితులకు నిత్యావసర సరుకులు

Kurnool: వరద బాధితులకు నిత్యావసర సరుకులు

10వేల కిట్ల తరలింపు..

వరద బాధితుల సహాయార్థం 10 వేల నిత్యావసర సరుకుల కిట్లను తీసుకుని విజయవాడకు వాహనాలు బయలుదేరాయని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. కలెక్టరేట్ నుండి జిల్లా టిడిపి తరుపున వ‌ర‌ద‌ బాధితుల స‌హాయార్ధం కోటి 50 లక్షల రూపాయ‌ల‌ విలువ చేసే 10 వేల నిత్యావసర కిట్లను తీసుకుని వెళుతున్న వాహనాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని టిడిపి వారు విజయవాడలోని వరద బాధితుల కొరకు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయలు విలువ చేసే పదివేల నిత్యావసర సరుకుల కిట్లను వాహనాలలో పెట్టి పంపించారన్నారు. ఒక్కొక్క కిట్టులో ఒక కుటుంబానికి పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు లాంటి బియ్యము, కందిపప్పు , చక్కెర, ఆయిల్, తదితర సరుకులను పంపించామన్నారు.
కార్యక్రమంలో పత్తికొండ శాసనసభ్యులు శ్యాం బాబు, టిడిపి జిల్లా అధ్య‌క్షుడు తిక్కారెడ్డి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి, రాష్ట్ర గొర్రెల పెంపకదారుల అధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల టిడిపి ఇన్చార్జీలు, టిడిపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News