Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Election commission: ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

Election commission: ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

Election commission| ఏపీలో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది. తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి జిల్లాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం(Election commission of india) షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. నవంబర్ 18వరకు నామినేషన్లు స్వీకరించనుంది. 19న నామినేషన్ల పరిశీలన.. 21న నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. ఇక డిసెంబర్ 5 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లువెల్లడించింది. అనంతరం డిసెంబర్ 9న ఫలితాలు ప్రకటించనున్నారు.

- Advertisement -

కాగా గతంలో తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్‌(PDF) తరఫున గెలిచిన యూటీఎఫ్‌(UTF) నేత షేక్‌ సాబ్జీ గతేడాది డిసెంబర్‌ 15న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన పదవీ కాలం 2027 మార్చి 29 వరకు గడువు ఉండటంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర, ఝూర్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు మూడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రకటించిన ఉప ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. కేరళ, పంజాబ్‌, యూపీలలో 14 అసెంబ్లీ సీట్లలో నవంబర్‌ 13న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీతో పాటు పలు సామాజిక సంస్థలు పోలింగ్‌ తేదీని మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేశాయి. వారి అభ్యర్థలను పరిగణనలోకిని తీసుకున్న ఈసీ పోలింగ్‌ తేదీని నవంబర్‌ 20కి మార్పు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News