విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పింది. అంతర్జాతీయ విమానాల్లో విమానాలు గాలిలో ఉన్నప్పుడు కూడా ప్రయాణికులు ఇంటర్నెట్‌ని ఉపయోగించుకునే అవకాశాన్ని పొందనున్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు ఈ సర్వీస్ లను అందించనున్నాయి. భారత గగనతలంలోకి ఇన్-ఫ్లైట్ వైఫై (In flight Wi-fi) వస్తుందని కొన్నాళ్లుగా వింటూనే ఉన్నాం. ఎట్టకేలకు ఈ అంశంపై కీలక అడుగు పడింది.
ఇండియన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఇటీవల విమానంలో, సముద్రంలో వైఫై కనెక్టివిటీకి సంబంధించి కొత్త నియమాన్ని ప్రకటించింది. కొత్త నిబంధనలతో ప్రయాణీకులు ఇంటర్నెట్ కనెక్టివిటీని యాక్సెస్ చేయడానికి అనుమతించే ప్రమాణాలను ప్రభుత్వ శాఖ నిర్దేశించింది. ప్రస్తుతం విస్తారా మాత్రమే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణీకులకు ఇన్-ఫ్లైట్ వైఫై (In flight Wi-fi) ని అందిస్తోంది. కొత్త నిబంధన మార్పుతో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి భారతీయ విమానయాన సంస్థలు, డొమెస్టిక్ ఫ్లైట్స్ లోనూ ప్రయాణికులకు సేవలను అందించగలవు.
Also Read : వైఎస్‌ఆర్‌కే పుట్టలేదని నన్ను అవమానించారు: షర్మిల
డాట్ (DoT) ఇటీవల విమానంలో వైఫై కనెక్టివిటీకి సంబంధించి రూల్ మార్పును ప్రకటించింది.
అక్టోబర్ 28న ప్రచురించబడిన ఇ-గెజిట్‌లో డాట్ ఇండియా నియమ మార్పును జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం భారతీయ గగనతలంలో విమానాలు ప్రయాణీకులకు కనీసం 3,000 మీటర్ల ఎత్తులో వైఫై ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలవు.