ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన తనయుడు నారా రోహిత్‌కు లేఖ రాశారు. రామ్మూర్తి నాయుడు లేని లేటు పూడ్చలేనిదని.. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రజలకు అందించిన సేవలను యావత్ ఆంధ్రరాష్ట్రం గుర్తుంచుకుంటుందని లేఖలో పేర్కొన్నారు. ఆయన భౌతికంగా దూరమైన మీ అందరి హృదయాల్లో కొలువుదీరి ఉంటారని తెలిపారు. రామ్మూర్తి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు వెల్లడించారు.
కాగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం హైదరాబాలోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం స్వగ్రామం నారావారి పల్లెలో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. సీఎం చంద్రబాబు, లోకేష్, ఇతర కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు.