IPL Auction: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం-2025 సౌదీ అరేబియాలోని జెడ్డాలో మరికాసేపట్లో జరగనుంది. ఈమేరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వేలం టైమింగ్స్‌ను మారుస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బ్రాడ్‌కాస్టర్ల అభ్యర్థన మేరకు వేలం సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30 గంటలకు మార్చింది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. పెర్త్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఉదయం 7.50 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. దీంతో మ్యాచ్, వేలం టైమింగ్స్ క్లాష్ కాకుండా వేలంను అరగంట వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా ఈ వేలంలో స్టార్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీల మధ్య తీవ్ర పోటీ ఏర్పడనుంది. స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే. ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పంజాబ్ కింగ్స్: రూ.110.5 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రూ.83 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: రూ.73 కోట్లు
గుజరాత్ టైటాన్స్: 69 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్: రూ.69 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రూ.55 కోట్లు
కోల్ కతా నైట్ రైడర్స్: రూ.51 కోట్లు
ముంబయి ఇండియన్స్: రూ.45 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్: రూ. 45 కోట్లు
రాజస్థాన్ రాయల్స్: రూ. 41 కోట్లు