Monday, December 9, 2024
Homeఆంధ్రప్రదేశ్RTC Bus: ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని యువకుడు మృతి

RTC Bus: ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని యువకుడు మృతి

RTC Bus: ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఉరేసుకుని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఏర్పేడు వెళ్తుండగా బస్సులో చివరి సీటులో కూర్చున్న యువకుడు హ్యాంగర్‌కు ఉరేసుకుని చనిపోయాడు. రేణిగుంట వద్ద కండక్టర్ దీనిని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండటం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News