జడ్చర్ల మున్సిపాల్టిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత అన్నారు. కావేరమ్మపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపల్ శానిటైజేషన్, జవాన్ల పని తీరుపై సమీక్ష నిర్వహించారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ శానిటైజేషన్ సిబ్బంది, జవాన్లు పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వార్డులలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
త్వరలోనే అన్ని వార్డులలో పర్యటిస్తానని, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సారిక, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్ రెడ్డి, నంద కిషోర్ గౌడ్, రఘురాం గౌడ్, సతీష్, ఉమా శంకర్ గౌడ్, బుక్క మహేష్, శశి కిరణ్, కుమ్మరి రాజు, విజయ్, చైతన్య చౌహాన్, రహీం, జ్యోతి, లత, చైతన్య, ఉమాదేవి, శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.