Friday, January 31, 2025
Homeనేరాలు-ఘోరాలుKarnataka: రేప్ కేసులో కర్ణాటక హై కోర్టు కీలక తీర్పు..!

Karnataka: రేప్ కేసులో కర్ణాటక హై కోర్టు కీలక తీర్పు..!

కర్ణాటక (Karnataka) హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై ఉన్న అత్యాచార (rape) ఆరోపణలను హై కోర్టు కొట్టి వేసింది. పరస్పర సమ్మతితో ఉన్న సంబంధాన్ని (relationship) అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో దాడి, మర్డర్ కు ప్రయత్నం, క్రిమినల్ బెదిరింపు ఆరోపణలను కోర్టు సమర్థించింది. ఇద్దరూ ఇష్టంతోనే కలిసి ఉన్నా మరొకరిపై దాడి చేయడం.. బెదిరించడాన్ని న్యాయ స్థానం తప్పు పట్టింది.

- Advertisement -

కర్ణాటక (Karnataka) శివమొగ్గ జిల్లాలోని సాగర్ కు చెందిన పోలీస్.. ఇన్‌స్పెక్టర్ బి. అశోక్ కుమార్ హైకోర్టులో ఓ సామాజిక కార్యకర్త పిటిషన్ వేశారు. 2017లో ఈ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్.. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. 2021 మేలో.. మహిళ తనపై శారీరక, లైంగిక వేధింపులు జరిగాయని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాక.. పిర్యాదును వెనక్కి తీసుకోవాలని, లేదంటే తన పిల్లలకు హాని కలగుతుందని ఇన్‌స్పెక్టర్ బెదిరించారని ఆమె ఆరోపించారు.

2021 నవంబర్ 11న, ఇన్‌స్పెక్టర్ పిర్యాదుదారుని ఒక హోటల్‌కు తీసుకెళ్లి, ఆమెపై శారీరక, లైంగిక దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆమెను రాత్రి 2.45 గంటలకు సాగర్‌లోని బస్టాప్ వద్ద వదిలేశారని పేర్కొంది. తరువాత ఆమె చికిత్స పొందింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌పై శారీరక, లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో కేసు నమోదు అయింది.

ఈ తీర్పులో భాగంగా.. న్యాయమూర్తి ఎం. నాగప్రసన్న తన తీర్పులో.. IPC సెక్షన్ 376(2)(n) కింద అత్యాచార ఆరోపణలను కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆ సంబంధం పరస్పర సమ్మతంతో ఏర్పడిందని అన్నారు. అయితే ఏ సంబంధమైనా దాడి లేదా క్రిమినల్ బెదిరింపును సమర్థించలేదని కోర్టు స్పష్టీకరించింది. ఈ అంశాలపై ఇన్‌స్పెక్టర్‌కు విచారణ తప్పదని కోర్టు తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News