ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra Babu) నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కాసేపట్లో చంద్రబాబు మార్కాపురం చేరుకుంటారు.
మొదట ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో మాట్లాడనున్నారు. అనంతరం, మహిళా దినోత్సవకార్యక్రమవేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శిస్తారు. లబ్ధిదారులకు పథకాల పంపిణీ చేపడతారు. అనంతరం కాసేపు విరామం తీసుకుని, మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా గంటన్నర పాటు మహిళలతో ముఖాముఖి సమావేశం అవుతారు.
ఈ కార్యక్రమం అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4.42 గంటలకు మార్కాపురం నుంచి అమరావతి బయల్దేరతారు.