Thursday, May 1, 2025
Homeనేరాలు-ఘోరాలుKaushik: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి

Kaushik: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ (Kaushik, a die-hard fan of Jr. NTR) మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న కౌశిక్‌ శుక్రవారం రాత్రి కన్నుమూసినట్లు సమాచారం. అతని కోరిక మేరకు ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యాన్నిచ్చారు.

దీంతో పాటు కౌశిక చికిత్సకు అవసరమైనా మెుత్తాన్ని అందించారు. ఈ లోపే జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందటం బాధకరం. దీంతో ఎన్టీఆర్ అభిమానులు #wemissyouKaushik అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఏడాదిగా బోన్ మ్యారో మార్పిడికి చికిత్స అందుకున్న కౌశిక్ బెంగళూరు ఆసుపత్రి నుంచి చెన్నై ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్, టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బోన్ మ్యారో మార్పిడి చేయించుకున్నారు. ఆపరేషన్ అనంతరం రికవరీ అవుతు వచ్చాడు.

- Advertisement -

అందరిలా స్నేహితులతో సరదాగా గడపాలి. జూనియర్ ఎన్టీఆర్ ను నేరుగా కావాలని అనుకున్న కౌశిక్ ఆశ ఆవిరైపోయింది. అమర్చిన బోన్ మ్యారో ఫెయిల్యూర్ కావడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచాడు. కౌశిక్ మరణం కుటుంబ సభ్యుల్లోనూ, ఎన్టీఆర్ అభిమానుల్లోనూ, అతని స్నేహితుల్లోనూ తీవ్ర శోకాన్ని నింపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News