నటుడు పోసాని కృష్ణమురళికి(Posani Krishna Murali) హైకోర్టులో భారీ షాక్ తగిలింది. మూడు కేసుల్లో బెయిల్ లభించడంలో జైలు నుంచి విడుదల అవుతాననుకున్న పోసానికి సీఐడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో పోసాని హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ పీటీ వారెంట్ రద్దు చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే విచారణ సందర్భంగా పోసానిని ఇప్పటికే పీటీ వారెంట్‌పై కర్నూలులో అదుపులోకి తీసుకున్నామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు. ఆయనను మంగళగిరి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు కర్నూలు నుంచి తీసుకువస్తున్నట్టు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పోసాని పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయంతో పోసాని తీవ్ర నిరాశకు గురయ్యారు. మంగళగిరి కోర్టు రిమాండ్ విధిస్తే మరికొన్ని రోజులు జైల్లో ఉండకు తప్పదు.