Saturday, March 22, 2025
Homeచిత్ర ప్రభRajitha: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత

Rajitha: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నటి రజిత(Rajitha) తల్లి విజయలక్ష్మి మరణించారు. గుండెపోటుతో ఇవాళ మధ్యాహ్నం ఆమె కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రజిత ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మికి చెల్లెళ్లు అవుతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News