Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుTSRTC: రోడ్డు ప్రమాదాలకు పాదచారులే బలి

TSRTC: రోడ్డు ప్రమాదాలకు పాదచారులే బలి

పాదచారులు రహదారులపై వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూచిస్తోంది. అజాగ్రత్తగా వల్ల తమ విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని చెప్తోంది. కొందరు పాదచారులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే టీఎస్‌ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురువుతున్నాయని తమ పరిశీలనలో వెల్లడయిందని తెలిపింది.

- Advertisement -

ఈ ఏడాదిలో ఫిబ్రవరి వరకు రోడ్డు ప్రమాదాల్లో 283 మంది మరణించారని, అందులో 71 మంది పాదచారులు ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయమని.. టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.   రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందిన వారిలో 25 శాతం పాదచారులే ఉండటంపై, ప్రమాదాలు జరిగిన తీరుపై ఇటీవల టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా విచారణ చేశారు.  ట్రాఫిక్‌ రూల్స్‌పై సరైన అవగాహన లేకపోవడం వల్లే పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఈ విచారణలో వెల్లడైంది.

పాదచారులు తెలిసో తెలియకో చేసే చిన్న తప్పిదాల వల్ల టీఎస్‌ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలిస్తే వారికి ట్రాఫిక్‌ రూల్స్‌పై సరైన అవగాహన లేదనే విషయం స్పష్టమవుతోంది. అందుకే రహదారులపై పాదచారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారించిన ప్రాణాలకే ప్రమాదమని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, హెచ్చరించారు.

దేశంలో రోడ్డు ప్రమాదానికి గురువుతున్న ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు పాదచారులుంటున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఆయా ప్రమాదాల్లో 15 నుంచి 20 శాతం మంది పాదచారులు మృత్యువాతపడుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పాదచారులు ట్రాపిక్‌ రూల్స్‌పై స్వీయ అవగాహన పెంచుకోవాలని సూచించారు. పాదచారులు అజాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కొల్పోయి తమ కుటుంబాలకు శోకాన్ని మిగల్చవద్దని హితవు పలికారు.   పాదచారులు ఫుట్‌పాత్‌లను ఉపయోగించుకోవాలి, రోడ్డును దాటేటప్పడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు.  పాదచారులు రాత్రుళ్లు రోడ్డు దాటేటప్పడు ఫ్లాష్‌ లైట్లను ఉపయోగించాలని,  సెల్‌ఫోన్‌, హియర్‌ ఫోన్స్‌ వాడుతూ రోడ్డు దాటడం ప్రమాదకరం. వాటి వల్ల వాహనాల హారన్‌ వినపడకపోవచ్చని,  రోడ్డును తొందరగా దాటేందుకు కొందరూ పరిగెత్తుతుంటారు. ఇది చాలా ప్రమాదకరమని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News