Tuesday, April 29, 2025
Homeచిత్ర ప్రభRohit Basfore: ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నటుడు అనుమానాస్పద మృతి

Rohit Basfore: ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నటుడు అనుమానాస్పద మృతి

బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. రెండు భాగాలు సూపర్ హిట్ కాగా ‘ఫ్యామిలీ మ్యాన్‌ 3’ వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే ఈ సిరీస్‌లో నటించిన రోహిత్ బస్ఫోర్(Rohit Basfore) అనే నటుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. అస్సాంలోని ఓ జలపాతం వద్ద శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి టూర్‌కు వెళ్లారు. అయితే ఆరోజు సాయంత్రం నుంచి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రంగా గాలించగా అస్సాంలోని ఓ జలపాతం వద్ద రోహిత్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఆయన మృతి వెనుక ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు చెబుతున్నారు. అయితే రోహిత్ కుటుంబ మాత్రం అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News