Minor rape case issue: నోయిడాలో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి.. జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. నిందితులతా.. బాధితురాలి తండ్రికి పరిచయం ఉన్న వ్యక్తులే కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే, బాధితురాలి తండ్రి నోయిడా సెక్టార్ 20లోని ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్నారు. ఇటీవల తన కుమార్తె అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం, వైద్యులు బాలికపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు బాధితురాలి తండ్రికి తెలిసిన వ్యక్తులే అని సమాచారం. ఈ నిందితుల్లో ఇద్దరు డ్రైవర్లు కాగా, మరొకరు ఇస్త్రీ పని చేస్తూ ఉండేవారు. ఈ ఇద్దరిపై భారత చట్టంలోని వివిధ సెక్షన్ల కింద, అలాగే లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ కల్పించే పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇందులో అపహరణ సెక్షన్ 137(2)), ఆడవారి గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో నేరపూరిత బలవంతం చేసినందుకు(సెక్షన్ 74), అత్యాచారం (సెక్షన్ 65) ఉన్నాయి. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీ నుండి అక్రమ రవాణా చేయబడిన టీనేజ్ బాలికల రక్షణ:
మరో సంఘటనలో, జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు అక్రమంగా రవాణా చేయబడి, గృహ కార్మికులుగా పనిలో పెట్టబడిన ఢిల్లీకి చెందిన ఇద్దరు టీనేజ్ బాలికలను పోలీసులు రక్షించారు. 13, 15 సంవత్సరాల వయస్సు గల ఈ ఇద్దరు బాలికలు డిసెంబర్ 23, 2024న తప్పిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఒక బాలిక తల్లి తన ఫిర్యాదులో, డిసెంబర్ 22 మధ్యాహ్నం రాజీవ్ నగర్‌లోని తమ ఇంటి బయట తన కుమార్తె, ఆమె స్నేహితురాలు చివరిసారిగా ఆడుకుంటునట్లు చూసినట్టు పేర్కొంది. ఈ కేసులో సెక్షన్ 137(2) (కిడ్నాప్) కింద కేసు నమోదు చేయబడినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) వీ .హరేశ్వర్ స్వామి తెలిపారు.