Thursday, June 26, 2025
Homeలైఫ్ స్టైల్Cucumber: కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. దోసకాయని తినాల్సిందే!!

Cucumber: కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. దోసకాయని తినాల్సిందే!!

Cucumber Benefits: కాలానుగుణంగా మార్కెట్లో అనేక రకాల కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా అనేక వ్యాధుల నుండి రక్షించడంలో కూడా సహాయపడతాయి. కాలానుగుణంగా మార్కెట్లో దొరికే కూరగాయలలో దోసకాయ ఒకటి. ఇది అనేక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ కె, సిలికాన్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దోసకాయను ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. ఇప్పుడు దోసకాయను తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. దోసకాయ శరీరాన్ని హైట్రేటెడ్ ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఇందులో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. దీని వినియోగం వేడి ప్రభావం కూడా తగ్గిస్తుంది. దీంతో హిట్ స్ట్రోక్ కూడా రాదు. దోసకాయను తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు సంబంధిత వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. మలబద్ధకం, మధుమేహం నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.


దోసకాయలో అధిక నీరు శాతం ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇది రిప్లేష్ గా ఉంచడమే కాకుండా ఆహారాన్ని జీర్ణం చేయడంలో కూడా సహాయపడుతుంది. శారీరకంగా చురుకుగా ఉన్నప్పుడు ఆహారంలో దోసకాయని చేర్చుకుంటే హైడ్రోజన్ ను నియంత్రిస్తుంది.

దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్లేవ నాయిడ్లు, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరాన్ని లోపలి నుండి రక్షించడంలో సహాయపడతాయి.

దోసకాయ ముక్కలు స్పాకు మంచి మార్గం. దీనిలోని నీరు చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేస్తుంది. అయితే ఇది సిలికాన్ కొల్లాజెన్‌ను పెంచుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దోసకాయలో కనిపించే యాంటీఆక్సిడెంట్లు చర్మం వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News