జమ్మికుంట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు పీసీలను కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్. సుబ్బారాయుడు సస్పెండ్ చేశారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న NM నాగ వెంకట్ రెడ్డి HC 1752, తిప్పారపు విద్యాసాగర్ PC 2484, అప్పల సత్యనారాయణ PC 3210, ఎండి రహీం PC 223 లు గత కొంతకాలంగా విధుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహించి, పై అధికారుల సూచనలు పాటించకపోవడంతో వారిపై శాఖాపరమైన విచారణ జరిగింది. విచారణ అనంతరం నివేదిక అందిన తరువాతే వీరిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్ సుబ్బారాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో HC 1752 నాగ వెంకట్ రెడ్డిపై జోన్ 3 రాజన్నజోన్ DIGకి తగు చర్య నిమిత్తం నివేదిక పంపారు.
ఈ సందర్భంగా కమిషనరేట్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ డ్యూటీ పట్ల విధేయతతో ఉండి, విధులు నిర్వహించి ప్రజల మన్ననలను పొందాలని, ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా, విధుల పట్ల అలసత్వం వహించినా సహించేది లేదని సుబ్బారాయుడు హెచ్చరించారు.