Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుMallapur: రైతులను నట్టేట ముంచితే ఎలా

Mallapur: రైతులను నట్టేట ముంచితే ఎలా

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే కొనుగోలు కేంద్ర నిర్వాహకులు అధిక తూకం వేసి రైతుల్ని నట్టేట ముంచుతున్నారని ఆగ్రహంతో చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికే అకాల వర్షాలు గాలి దుమరాలతో,వడగళ్ళతో చాలా నష్టపోయామని, మళ్లీ ఇప్పుడు బస్తాకు రెండు కిలోల అధిక తూకం వేస్తే తాము ఎట్లా బ్రతికేదని అగ్రహించి ఆవేదనను నిరసన రూపంలో తెలియజేశారు. రైతులు చేస్తున్న నిరసనకు కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగా రావు, బిజెపి నాయకులు సాంబార్ ప్రభాకర్ మద్దతు తెలిపారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రవీందర్ రైతులతో మాట్లాడారు. వ్యవసాయ విస్తరణ అధికారి కొనుగోలు కేంద్రంలో ఉండి సరైన ధాన్యాన్ని సర్టిఫై చేస్తారని, ఆ తర్వాత తూకం వేస్తారని, ఎక్కువ తూకం వేసే వారిపై చర్యలు ఉంటాయని రైతులకు తెలిపారు. దాంతో రైతులు నిరసనను విరమింప చేశారు. నిరసన చేసిన వారిలో మహిళా రైతులు విజయ, రాధ,చిట్టక్క, అనుష,రైతులు ఇట్టేడి శేఖర్ రెడ్డి, అంజిరాజ్, గడ్డం. లింగా రెడ్డి, నారాయణ రెడ్డి, జలందర్, ప్రతాప్ తదితర రైతులు ఉన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News